Monday 7 December 2015

DSP loves with Praneetha

దేవిశ్రీప్రసాద్- ఛార్మి కౌర్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఆ విషయాన్నే అడిగితే.. మేమా లవర్సా.. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంటూ సంతూర్ సోప్ యాడ్ రేంజ్‌లో కహానీలు చెపుతుంటారు. వాళ్లు ఎంత కాదన్నా.. ఇద్దరి మధ్య.. అంతకు మించి కథ నడుస్తోందని జనాల ఊహ. ఆ ఊహలు అలాగే ఉన్న టైమ్‌లో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. మరోసారి సేమ్ ఇష్యూ‌తో మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఛార్మిని సైడ్ ట్రాక్‌లో పెట్టి.. మరో యంగ్ బ్యూటీ ప్రణీతని మెయిన్ ట్రాక్ ఎక్కించడమే ఇందుకు కారణమని సినీజనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

అసలు విషయంలోకి వచ్చేస్తే.. దేవిశ్రీ ప్రసాద్- ప్రణీత మధ్య లవ్ గేమ్ స్టార్ట్ అయిందని ఇప్పుడు టాలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారని..కలసి షికార్లు చేయడంతో పాటు.. ఫోన్‌లో గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటున్నారని కూడా వినిపిస్తోంది. ఇక వాట్సప్ మెసేజ్‌లకు లెక్కే లేదట. దీంతో ఛార్మికి హ్యాండిచ్చి.. ఈ కన్నడ బ్యూటీతో రాక్ స్టార్ లవ్‌లో పడ్డాడని మాట్లాడుకుంటున్నారు సినీజనాలు. అయితే ఇలాంటి విషయాల్లో వెంటనే క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు కనుక.. ఇక కొన్నాళ్ల పాటు.. దేవి, ప్రణీత ప్రేమవ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ కానుంది.

No comments:

Post a Comment